Argument between BRS and Congress leaders At Jangaon : పాలకుర్తిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. - తెలంగాణ తాజా వార్తలు
Published : Sep 28, 2023, 9:13 PM IST
Argument between BRS and Congress leaders At Janagama :జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాలతో.. కాంగ్రెస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన అఖిలపక్ష నాయకులను.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు.. రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు మంత్రికి మద్దతుగా ఆందోళనకు దిగారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఝాన్సీరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. పోలీస్‌స్టేషన్లో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఝాన్సీరెడ్డి పోలీసులకు అందించారు.