డ్యాన్స్‌లోనూ తగ్గేదేలే అంటున్న మంత్రి అంబటి రాంబాబు - మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్
Minister Ambati Rambabu Dance ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సంక్రాంతి సంబురాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి.. డ్యాన్స్ చేసి అందరినీ ఊర్రూతలూగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. భోగి మంటల ప్రాధాన్యం గురించి తనదైన శైలిలో ప్రవచించారు. నేను చలి కాచుకోవటానికి రాలేదని.. స్టెప్పులు వేసేందుకు వచ్చానని తెలిపారు. మంచి ఫాస్ట్ బీటున్న పాట పెట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి.. సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ భోగి మంటల చుట్టూ తిరిగారు.