చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు - Chandrababu anticipatory bail
Published : Nov 24, 2023, 1:13 PM IST
|Updated : Nov 24, 2023, 9:48 PM IST
AP High Court Verdict on Chandrababu Case :అమరాతి ఇన్నర్ రింగ్ రోడ్డు, (Amarathi Inner Ring Road Case) ఇసుక విధానానికి సంబంధించి.. చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసుల మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై (Chandrababu bail) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది (High Court on Chandrababu Case). ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ (High Court issued orders to CID) చేసింది. అటు ఇసుక పాలసీ కేసులోనూ.. తదుపరి ఉత్తర్వలు ఇచ్చే వరకు చంద్రబాబుపై చర్యలో తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇసుక విధానం కేసుపై విచారణను ఈ నెల 30కి హైకోర్టు వాయిదా వేసింది.