ఏపీ సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు - TS High Court judgments
Published : Nov 3, 2023, 8:12 PM IST
AP CID Lookout Circular Suspended by TS High Court: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను.. తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) సస్పెండ్ చేసింది. కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సీఐడీ.. లుక్ అవుట్ సర్క్యులర్‌ను (L.O.C) జారీ చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. దేశం విడిచి వెళ్లవద్దని మార్గదర్శి ఎండీపై ఎలాంటి నిషేధాజ్ఞలు గానీ, ఆదేశాలు గానీ లేవని హైకోర్టు స్పష్టం చేసింది.
Next Hearing Adjourned November 28: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌పై L.O.C తొలగించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఏపీసీఐడీ తెలిపింది. L.O.C తొలగించామన్న ఇమ్మిగ్రేషన్ బోర్డు ఈమెయిల్‌ను కోర్టుకు సమర్పించింది. కోర్టు ధిక్కరణపై క్షమాపణ అడిగారా..? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించగా.. ఏ పరిస్థితుల్లో L.O.C ఇవ్వాల్సి వచ్చిందో కౌంటరులో వివరించామని సీఐడీ అధికారుల తరఫు న్యాయవాది తెలిపారు. అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సీఐడీ అదనపు ఎస్పీ రాజశేఖర్ నేటి విచారణకు హాజరవగా.. ఈనెల 28న కూడా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
Shailaja Kiran Petition in High Court:మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌పై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని.. మార్చి 21న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. సీఐడీ అధికారులు జూన్ 1న లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దాంతో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి L.O.C జారీ చేసినందున.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ శైలజా కిరణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్ శుక్రవారం విచారణ జరిపారు.