మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదు : పురందేశ్వరి - మహేశ్వరంలో పురందేశ్వరి ఎన్నికల ప్రచారం
Published : Nov 23, 2023, 8:22 PM IST
AP BJP Chief Purandeshwari Election Campaign in Telangana : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో వేరుపడిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచి అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు మద్దతు పలుకుతూ ప్రచారం నిర్వహించారు.
Telangana Election Polls 2023 : కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైందని.. మేడిగడ్డ కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులతో కుంగిపోయిందని అగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయిందని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడలో ఒక వర్గానికే డబుల్ బెడ్ రూమ్ కేటాయించి మహేశ్వరం నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి అన్యాయం చేశారని మండిపడ్డారు.