తెలంగాణ

telangana

Antony Blinken

ETV Bharat / videos

ఆటోలో అమెరికా విదేశాంగ మంత్రి షికార్లు.. మసాలా ఛాయ్​ టేస్ట్​.. - క్వాడ్​ దేశాలు

By

Published : Mar 4, 2023, 4:56 PM IST

జీ20 సమావేశాల్లో భాగంగా భారత్ విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ ఆటోలో షికార్లు కొట్టారు. దిల్లీ వీధుల్లో ఆటోలో ప్రయాణించి సందడి చేశారు. దీంతో పాటుగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులతో సరదాగా గడిపారు ఆంటోనీ బ్లింకెన్​. అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్​లో కృషి చేస్తున్న వివిధ రాష్టాల కాన్సులేట్​లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇండో-పసిఫిక్​ రీజియన్​లో సంరక్షిచడంలో అమెరికా, భారత్ నిబద్ధతకు తన పర్యటన అద్దంపడుతోండని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్వాడ్ సభ్యదేశాలైన భారత్​, జపాన్​, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరితో కలిసి చైనా దూకుడుకు కళ్లెం చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను చర్చించినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్​లోని మసాలా ఛాయ్​ను రుచి చూడడం సహా.. ప్రతిభావంతులైన మహిళలతో కూడా సమావేశమయ్యానని బ్లింకెన్ తెలిపారు. సమయం దొరికితే తాను ఎక్కువగా భారత్​లోనే కాలం గడపడడానికి ఇష్టపడుతానని బ్లింకెన్ చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details