తెలంగాణ

telangana

annakut puja 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 9:40 PM IST

ETV Bharat / videos

శ్రీకృష్ణుడికి నైవేద్యంగా 1100 రకాల ప్రసాదాలు- ఎప్పుడూ చూడని స్వీట్లు, కేకులు!

Annakoot 2023 Swaminarayan Temple Gujarat :గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని శ్రీ స్వామినారాయణ్‌ ఆలయంలో ఎప్పటిలాగే అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, కేకులు, రుచికరమైన వంటకాలను శ్రీకృష్ణుడికి సమర్పించారు. కన్నయ్యకు 1100 రకాల ప్రసాదాలను అర్పించారు. పలువురు మహిళలు, పురుషులు కలిపి ఐదు రోజుల పాటు శ్రమించి ఆ ప్రసాదాలను తయారు చేశారు.  

అన్నకూట్‌ వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో కృష్ణుడిని ప్రార్ధించారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ నాడు ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో సాధువులు, పండితులు హాజరై వేదమంత్రాలు పఠించారు. 

Akshardham Temple Gujarat Diwali Celebration : గుజరాత్​.. గాంధీనగర్​లో ఉన్న అక్షర్​ధామ్​ ఆలయ ఆవరణలోని ఉన్న తోటలో 100కుపైగా విద్యుత్​ దీపాలను గ్లో గార్డెన్​ థీమ్​తో అలంకరించారు ఆలయ నిర్వాహకులు. అందుకు సంబంధించిన వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి. 

ABOUT THE AUTHOR

...view details