అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును నమిలిన వ్యక్తి..
మద్యం మత్తులో బతికున్న పామును నోటితో నమిలాడు ఓ వ్యక్తి. అక్రమణ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లాల్కువాన్ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో.. అక్కడి వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇళ్లను సైతం తొలగిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఓ పాము వచ్చింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో పాము నోటి భాగాన్ని నమిలేశాడు. అక్కడున్న వారు ఎంత చెప్పిన వినకుండా ఎడాపెడా పామును కొరికేశాడు. అయినా ఆ వ్యక్తికి ఎటువంటి విషం ఎక్కకపోవడం గమనార్హం. ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు.. వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాగా వీడియోను చూసిన ఫారెస్ట్ అధికారులు.. ఘటనపై స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని చేయకూడదని వారు సూచించారు.