తెలంగాణ

telangana

Ananthagiri waterfalls in vikarabad

ETV Bharat / videos

Ananthagiri Waterfalls : అందాలకు అడ్రస్‌గా మారిన అనంతగిరి - beautiful places in telangana

By

Published : Jul 22, 2023, 7:00 PM IST

Ananthagiri Waterfalls in Vikarabad District: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనంతగిరి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి అడవిలో నీటిదారులు ఎగిసిపడుతుండడంతో వాటిని తిలకించేందుకు పరిగి, తాండూర్, జహీరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను వీక్షించడానికి వస్తున్న పర్యాటకలతో అనంతగిరి నందిగాట్‌లో సందడిగా మారింది. సాధారణ సమయంలోనే ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వర్షపు నీరు ఎక్కువగా రావడంతో జలపాతల్లో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అక్కడి అందాలు మరింతగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మనసుకు ఆనందం కలిగించేలా వాతావరణం అనంతగిరి అందాలు కల్పిస్తున్నాయి. భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సరైన వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే.. పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని చేరుకోడానికి రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 82 కిలో మీటర్లు దూరం ప్రయాణించాలి.

ABOUT THE AUTHOR

...view details