ఎదురుగా ట్రైన్.. పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. సెకన్ల వ్యవధిలోనే.. - Accident recorded in CCTV footage in kerala
కేరళలో ఒక వృద్ధుడికి పెను ప్రమాదం తప్పింది. రైలు వస్తుండగా పట్టాలపై పడిపోయిన వృద్ధుడుని ఒక వ్యక్తి వచ్చి తప్పించి ప్రమాదం నుంచి కాపాడాడు. ఈ సంఘటన కొల్లం జిల్లాలో మార్చి 4వ తేదీన తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగింది. 72 ఏళ్ల వృద్ధుడు.. దివ్యాంగురాలైన తన భార్య కోసం టీ తీసుకురావడానికి వెళుతున్నాడు. వృద్ధుడు రైలు పట్టాలపై నడుస్తుండగా అకస్మాత్తుగా పడిపోయాడు. ఆ వృద్ధుడికి చాలా సమీపంలోనే రైలు ఉంది. రైల్వే ట్రాక్‌కు దగ్గరలో ఉన్న దుకాణంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి టీ తాగుతున్నాడు. వృద్ధుడు పడిపోయిన విషయాన్ని రెహమాన్ గమనించాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని పట్టాల పైనుంచి బయటకు లాగాడు. కొన్ని సెకన్లలోనే రైలు పట్టాల పైనుంచి వెళ్లింది. పెను ప్రమాదం నుంచి వృద్ధుడు క్షేమంగా బయటపడ్డట్లైంది. సంఘటన జరిగిన చోట ఉన్న వ్యక్తులు కింద పడిపోయిన వృద్ధుడిని పైకి లేపి వివరాలు తెలుసున్నారు ఈ ఘటన అంతా సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.