జోడో యాత్రలో రాహుల్ జోష్ కొరడాతో కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ - కొరడా కొట్టుకుని అభిమానుల్లో జోష్ నింపిన రాహుల్
Bharat Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. గణేశ్ గడ్డ నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సంగారెడ్డి శివారు వరకు చేరుకుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఓ చోట ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజులాగా.. కొరడాతో ఆడిపాడి ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. అంతకుముందు ఆదివాసీ మహిళలతో రాహుల్‌గాంధీ, రేవంత్, సీతక్క, జగ్గారెడ్డిలు కలిసి సరదాగా కాసేపు డ్యాన్స్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST