మూడేళ్ల చిన్నారిని ఢీకొన్న కారు.. అక్కడికక్కడే.. - gujarat news
ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలిక.. కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన గుజరాత్లోని సూరత్ జిల్లాలో జరిగింది. గోదాధర ప్రాంతానికి చెందిన వష్రంభాయ్.. తన కుటుంబంతో అత్తారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అతడి మూడేళ్ల కుమార్తె.. ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటోంది. ఆ తర్వాత వీధి చివరకు పరిగెత్తి వెళ్లింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న బాలిక మేనమామ కారు.. ఆమెను ఢీకొట్టింది. కారు ముందు చక్రాల కింద చిన్నారి నలిగిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండాపోయింది. అప్పటికే బాలిక మరణించింది. మొత్తం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.