Fashion Show: 'సినీ తారల తళుక్కులు.. మోడల్స్ మెరుపులు' - హైదరాబాద్ వార్తలు
Fashion Show in Hyderabad: సినీ తారల తళుక్కులు.. మోడల్స్ మెరుపులు ఫ్యాషన్ ప్రియులన్నీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడు రోజులపాటు సూత్రా పేరిట ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఓ హోటల్‌లో ప్రదర్శనకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు పూజ, అహారిక, పావనితో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్ వస్త్రా భరణాలను మోడల్స్ ప్రదర్శించి మెప్పించారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 29 వరకు మూడురోజుల పాటు ఈ వస్త్రా భరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 మందికి పైగా డిజైనర్లు తమ నూతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. మగువలకు కావాల్సిన యాక్సిసరీస్, వస్త్రాలు, అభరణాలు, చీరలు, దుస్తులు ఇలా అన్ని రకాలైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు వారు వివరించారు.