employee thrashed by a customer
లోన్ విషయంలో గొడవ.. బ్యాంక్ ఉద్యోగిపై ఖాతాదారుడి దాడి
బ్యాంక్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ ఖాతాదారుడు. గుజరాత్లోని నడియాద్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిబ్రవరి 3న ఈ ఘటన జరిగింది. బ్యాంక్ లోన్ విషయంలో ఉద్యోగితో వాగ్వాదం పెట్టుకున్నాడు ఖాదాదారుడు. అనంతరం కోపంతో అతడిపై చేయి చేసుకున్నాడు. ఖాతాదారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నడియాద్ పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 6, 2023, 4:07 PM IST