జగిత్యాలలో 82 ఏళ్ల వృద్దురాలి నామినేషన్ - filed nomination to contest from Jagityal
Published : Nov 7, 2023, 5:00 PM IST
An 82-year-old woman filed nomination to contest from Jagityal : జగిత్యాలలో 82 ఏళ్ల వృద్దురాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క్యూరిక్యాల గ్రామానికి చెందిన చీటి శ్యామల అనే వృద్దురాలు తన బంధువులతో కలిసి నామినేషన్ వేసింది. తనను పెద్ద కొడుకు శ్రీరాంరావు పోలీస్స్టేషన్లో కేసు వేసి, ఇబ్బంది పెడుతున్నాడని ఆమె వాపోయింది. దీంతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపింది. కొడుకు కేసు వేయటంతో తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని.. ఆ ఇంటిపై కేసు ఉన్నందున ఎవరు కొనడానికి ముందుకు రావడం లేదని వృద్దురాలు వాపోయింది.
ఇదివరకే పెద్ద కొడుకు తన వంతు ఆస్తి తీసుకోగా.. ఇంకా తల్లి చెందిన ఆస్తి రావాలని శ్రీరాం రావు ఠాణాలో కేసు వేశాడని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. బంధువుల సహాయంతో పెద్ద కొడుకు పోలీస్ స్టేషన్లో కేసు వేశాడని.. కోర్టులో ఈ కేసు కొనసాగుతోందని.. ఈ విషయం అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నామినేషన్ వేశానని శ్యామల పేర్కొంది..