బీజేపీ అధికారంలోకి వస్తే పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం : అమిత్ షా - ఖైరతాబాద్‌లో బీజేపీ రోడ్‌షో
Published : Nov 25, 2023, 8:09 PM IST
Amit Shah Roadshow at Khairatabad in Hyderabad : రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ప్రశ్నపత్రాలను లీక్ చేసిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ రోడ్‌షోలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.
BJP Road Show in Hyderabad : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉచితంగా రామమందిరం దర్శనం కల్పిస్తామని అమిత్‌షా మాట ఇచ్చారు. అందుకు ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. చింతల రామచంద్రారెడ్డి తరఫున రోడ్‌షో నిర్వహించిన కేంద్రమంత్రి.. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని.. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను ఇక్కడ నిర్వహిస్తామన్నారు.