ఆస్పత్రికి వెళ్లే దారిలో రోగికి మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్ - Viral videos
రోగితో అంబులెన్స్ డ్రైవర్ మద్యం తాగిస్తున్న ఘటన ఒడిశా జగత్‌సింహ్‌పూర్ జిల్లాలో జరిగింది. రోడ్డు పక్క అంబులెన్స్ ఆపి డ్రైవర్, రోగి మద్యం తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తిర్టోల్ ప్రాంతంలోని కటక్ ప్యారడైజ్ రహదారిలో సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంబులెన్స్‌లో పడుకున్న రోగికి డ్రైవర్ మద్యం పోస్తున్న దృశ్యాలు వీడియోలో సృష్టంగా కనిపిస్తున్నాయి. కెందుజార్ ప్రాంతానికి చెందిన నకులే దేహూరి అనే వ్యక్తి ప్యారడైజ్‌లో నివాసం ఉంటున్నాడు. చెట్టును నరుకుతూ ప్రమాదవశాత్తు అతడు కిందపడ్డాడు. దీంతో అతని కాలు విరిగింది. అయితే, రోగి అడగడం వల్లే తాను మద్యం పోశానని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. కాగా, అంబులెన్స్‌లో ఓ మహిళ, పిల్లాడు సైతం కనిపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST
TAGGED:
వైరల్ విడియోలు