తెలంగాణ

telangana

Ambulance road accident

ETV Bharat / videos

Ambulance accident Hyderabad : అదుపు తప్పి డివైడర్​ను ఢీకొన్న అంబులెన్స్.. డ్రైవర్ మృతి - telangana latest news

By

Published : Jul 25, 2023, 11:11 AM IST

Ambulance accident in Hyderabad : ఎవరికైనా ఆపదొస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి వాలుతుంది. ఇలాంటి  విషయాల్లో అంబులెన్స్ డ్రైవర్లు చాలా అలర్ట్​గా ఉంటారు. ఏ రోడ్డు ప్రమాదమో జరిగితే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. కానీ తాజాగా.. అలాంటి అంబులెన్సే రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ బి.ఎన్ రెడ్డి నగర్‌లో ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న అంబులెన్స్ డ్రైవర్​ మృతి చెందాడు. 

వర్షాలు కురుస్తున్న కారణంగా రోడ్లు చిత్తడిగా మారడంతో అతి వేగంతో వస్తున్న అంబులెన్స్ డివైడర్​ను ఢీ కొట్టి బోల్తా పడింది. అయితే అంబులెన్స్​లో ఆక్సిజన్ సిలిండర్ రాపిడికి ఇంధన ట్యాంక్ నుంచి మంటలు అంటుకోవడంతో క్షణాల్లో వాహనం కాలిపోయింది. అది గమనించిన స్థానికులు డ్రైవర్​ను అంబులెన్స్​లోంచి బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు తీవ్ర గాయాల కారణంగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details