తెలంగాణ

telangana

ETV Bharat / videos

దేవుడి కోసం ఎయిర్​పోర్ట్​లో విమానాలన్నీ 5 గంటలు బంద్ - కేరళ పద్మనాభ స్వామి ఊరేగింపు

By

Published : Nov 2, 2022, 4:03 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షన్ముగం బీచ్​ వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎయిర్​పోర్ట్ రన్​వేపై నుంచి ఉత్సవం సాగిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఐదు గంటల సేపు విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన ఎయిర్​లైన్లకు చెందిన సుమారు 10 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. అల్పశి ఆరట్టు పేరుతో ఏడాదికి రెండుసార్లు ఈ ఊరేగింపు నిర్వహిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపు జరిగే మార్గంలోనే 1932లో తిరువనంతపురం విమానాశ్రయం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు.. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details