'దుషాలా' జీవిత కథాంశంతో రవీంద్ర భారతిలో అలేఖ్య ప్రదర్శన - నర్తకిమణి అలేఖ్య పుంజలా నృత్యనాటిక
Published : Nov 6, 2023, 12:20 PM IST
Alekhya punjala Performs Dushala Kuchipudi Dance: మహాభారతంలోని ధ్రుతరాష్ట్రుడు, గాంధారి ఏకైక కుమార్తె దుషాలా జీవిత కథాంశంతో ప్రముఖ కూచిపూడి గురువు, నర్తకీమణి అలేఖ్య పుంజలా నృత్య నాటిక ఆకట్టుకుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో.. తృష్ణ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ.. సూత్రధార్, రాష్ట్ర ప్రభుత్వం భాష, సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 'దుషాలా.. ఆమె చెప్పిన కథ' శీర్షికతో నిర్వహించిన ఈ నృత్య నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నర్తకిమణి అలేఖ్య దుషాలా పాత్రలో తన నృత్య కౌలస్యం ప్రదర్శించి ఔరా అనిపించారు.
యుగాలుగా దుషాలా తన బాధ, వేదన, గుర్తింపు కోసం ఆమె పడే ఆరాటం గురించి ప్రదర్శించి అలేఖ్య తన ప్రదర్శనతో మెప్పించారు. ఆలేఖ్య ఒకరే దాదాపు 60 నిమిషాల పాటు కూచిపూడి, జానపద నృత్య అంశాలతో నయమనోహారంగా ప్రదర్శించిన తీరు వీక్షకులను ఆకట్టుకుంది. ఆలేఖ్య ప్రదర్శనకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నృత్యాకళాభిమానులు అభినందనలు తెలిపారు.