అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్ థీమ్'తో 10వేల దీపాలంకరణ! - అక్షర్ధామ్ ఆలయం గాంధీనగర్
Published : Nov 11, 2023, 9:33 PM IST
Akshardham Temple Gujarat Diwali Celebration : గుజరాత్.. గాంధీనగర్‌లో ఉన్న అక్షర్ధామ్ ఆలయంలో పది వేల దివ్వెలతో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలోని ఉన్న తోటలో 100కుపైగా విద్యుత్ దీపాలను గ్లో గార్డెన్ థీమ్‌తో అలంకరించారు ఆలయ నిర్వాహకులు. 1990ల్లో నిర్మితమైన ఈ ఆలయంలో ఏటా 10వేల దీపాలను ఆలయ వాలంటీర్లు వెలిగిస్తున్నారు. 32ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు తెలిపారు.
"సాధారణంగా ప్రతి సోమవారం.. అక్షర్ధామ్ ఆలయంలో లైటింగ్ ఆపివేస్తాం. కానీ ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా మరిన్ని విద్యుత్ దీపాలతో అలకరించాం. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించనున్నారు. రానున్న రోజుల్లో ఆలయం వెలుపల 49 అడుగుల స్వామి నారాయణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది" అని గాంధీనగర్ అక్షరధామ్ స్వామినారాయణ ఆలయ వాలంటీర్ జయేశ్ మండల్కర్ ఈటీవీ భారత్‌తో తెలిపారు. మరోవైపు, శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.