National Leaders Condemned CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన జాతీయ నేతలు - Farooq Abdullah Condemned CBN Arrest
Published : Sep 12, 2023, 1:30 PM IST
|Updated : Sep 12, 2023, 3:25 PM IST
Akhilesh Yadav condemned CBN arrest: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖండించారు. అరెస్టు చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలను ఆయన టీడీపీ సీనియర్ నేత యనమల (TDP senior leader Yanamala) కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని అఖిలేష్ తెలిపారు.
Farooq Abdullah Condemned CBN Arrest: ఖండించిని ఫరుక్ అబ్దుల్లా.. చంద్రబాబు అరెస్టును నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసి ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. ఎన్నికల ముందు ప్రజల్లో చైతన్యం కోసం పోరాడుతున్న చంద్రబాబును.. జైలుకు పంపి బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబును జైలుకు పంపడం వల్ల ఆయనకే మేలు జరుగుతుందని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.
West Bengal CM Mamata Banerjee Condemns CBI Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను బంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపులా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరపాలన్న దీదీ.. కక్షసాధింపు ధోరణి సరికాదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి ఇది బూమ్‌రాంగ్ ( Boomerang) అవుతుందని చెప్పారు. అధికారంలో ఉన్నామని ఇలా చేస్తే... రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చి వారు కూడా అలాగే చేస్తారనే విషయం మర్చిపోవద్దన్నారు. చంద్రబాబునాయుడి అరెస్టును తాము సమర్థించడం లేదని దీదీ స్పష్టం చేశారు. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలి.. తనిఖీలు చేయాలి.. విచారణ జరపాలి తప్పా.. అధికారం చేతిలో ఉందని కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.