తెలంగాణ

telangana

Air Traffic Control Center

ETV Bharat / videos

ఎమర్జెన్సీలో విమానాలు ఎలా ల్యాండ్ చేస్తారు.. కంట్రోలింగ్ ఎవరి చేతుల్లో ఉంటుంది..? - ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్

By

Published : Mar 14, 2023, 11:53 AM IST

Air Traffic Control Center: దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి. దిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత నాలుగో స్థానాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఆక్రమించింది. ఇక్కడి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతి 3 నిమిషాలకు ఒక విమానం రాకపోకలు సాగిస్తోంది. ఈ విమానాలను కంట్రోల్ చేసేది ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సెంటర్. ఇదీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఓ టవర్‌లో ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తూనే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పైలట్లకు మార్గనిర్దేశం చేస్తూ విమానాలను నియంత్రిస్తుంటారు.

విమానం ఇంజిన్ స్టార్టింగ్ నుంచి గాల్లో ఎగిరి రాడార్ కనెక్ట్ అయ్యే వరకు ఏటీసీ చూసుకుంటుంది. ఇక విమానాలు ల్యాండ్ అయ్యే సమాచారాన్ని రాడార్ నుంచి తీసుకుని క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చూస్తారు. ఏటీసీ ఎలా పని చేస్తుంది.. అక్కడి ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వహిస్తుంటారు.. విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు.. వాతావరణం సహకరించని సమయంలో విమానాలు క్షేమంగా దిగేందుకు ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే వివరాలను శంషాబాద్‌ ఏటీసీ సెంటర్‌ నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details