Muppalla Subbarao Interview about Chandrababu Arrest: రాజకీయ దురుద్దేశంతో సీఐడీ స్వామి భక్తి: ముప్పాళ్ల సుబ్బారావు - CID remand report to court skill development case
Published : Sep 10, 2023, 9:27 AM IST
President of Bar Association of India Muppalla Subbarao Interview about Chandrababu Arrest:స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో (AP Skill Development Case) తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడును సీఐడీ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని... భారత న్యాయవాదుల సంఘం ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో సీఐడీ స్వామి భక్తిని నిరూపించుకుంటుందని ఆక్షేపించారు. రిమాండ్ రిపోర్టులో సరైన ఆధారాలు పొందుపరచకుండా.. అంతర్జాతీయ ఉగ్రవాదిలా నారా చంద్రబాబుని. వందల మంది పోలీసులతో అరెస్టు చేయడాన్ని (Muppalla Subbarao Comments on AP Police Behavior) ఆయన తప్పుబట్టారు. నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులపై పోలీసులు తీరు ఆక్షేపణీయం ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టు, సీఐడీ తీరు, తదుపరి పరిణామాలపై ముప్పాళ్ల సుబ్బారావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖీ.
Chandrababu Arrest in Nandyala :తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ CID అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు నోటీసులు (CID Notices to Chandrababu Naidu) ఇచ్చారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సమర్పించాలని పోలీసులను చంద్రబాబు కోరారు.