తెలంగాణ

telangana

Adulterated Milk Scandal in Siddipet

ETV Bharat / videos

సిద్దిపేటలో 6 వేల లీటర్ల పాలు పారబోత - అసలు కారణం ఇదే

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 3:37 PM IST

Adulterated Milk Scandal in Siddipet : సిద్దిపేట జిల్లా చేర్యాల పాలశీతలీకరణ కేంద్రంలో కల్తీ పాల విషయంలో కొన్నాళ్లుగా గొడవ జరుగుతుంది. ఇటీవల చేర్యాల నుంచి హైదరాబాద్​ ప్రధాన కేంద్రానికి పాల ట్యాంకర్లు వెళ్లాయి. అక్కడ అధికారులు ట్యాంకర్లలోని పాలను పరిశీలించి, 6 వేల లీటర్లు కల్తీ పాలగా గుర్తించారు. పాల ట్యాంకర్లను వెనక్కి పంపించారు. ఇదివరకే ఇలాంటి ఘటన జరిగింది. మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో మేనేజర్​తో గొడవకు దిగారు. 

దీంతో పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు స్థానిక మేనేజర్​ను నిలదీశారు. పరీక్షలు చేయకుండా ఆరోపించడం సరికాదని, ఏ రోజుకారోజు పాలను పరీక్షించి కల్తీ ఉంటే ఆపేయాలని సూచించారు. పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. హైదరాబాద్​కు పంపించిన పాలు తిరిగి వాపస్ రావడంతో వాటిని పారపోశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. ఇకనైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.                

ABOUT THE AUTHOR

...view details