తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మహేశ్​బాబుకు కథ చెప్పలేదు.. నాపై నమ్మకంతో 'మేజర్'​ నిర్మించారు' - మేజర్ సినిమా 2022

By

Published : Jun 1, 2022, 1:34 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

అడవి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. ఈ సినిమా జూన్​ 3వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్​లో భాగంగా బెంగళూరు వెళ్లిన.. అడివి శేష్ 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేజర్​ సినిమా కోసం మొదటిసారి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు శేష్​. అరగంటలోనే అన్ని చోట్లా హౌస్​ఫుల్​ అయినట్లు పేర్కొన్నారు. మహేశ్​బాబుకు మొదట కథ చెప్పలేదన్నారు. తన గత సినిమాలు మహేశ్​కు బాబుకు నచ్చాయని.. ఆ నమ్మకంతోనే నిర్మించేందుకు ముందుకొచ్చారన్నారు. ఇలా.. సినిమాకు సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అడివి శేష్​.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details