ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆందోళన - కలెక్టర్ చొరవతో ధర్నాను విరమించిన జూడాలు - Adilabad RIMS Medical College Students Attack
Published : Dec 14, 2023, 2:00 PM IST
Adilabad RIMS Medical College Students Attacked By Thugs : ఆదిలాబాద్ రిమ్స్ వైద్యకళాశాల వద్ద ఉద్రిక్తత వాతవారణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి కళాశాలలోకి అక్రమంగా చొరబడిన దుండగులు పలువురు విద్యార్థులపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ జరగగా ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రిమ్స్ జూడాలు, మెడికోలు ఆందోళన బాట పట్టారు. ఉదయమే కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Junior Doctors Allegations On RIMS Director : హస్టల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డైరెక్టర్‌కు విన్నవించాం. ఆయన మా గోడు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆ తర్వాత కొంతమంది దుండగులు మాపై దాడి చేశారు. వారు డైరెక్టర్ సాయంతోనే మాపై దాడికి దిగారేమోనని మా అనుమానం. అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఫిర్యాదు స్వీకరించామని దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై అదనపు కలెక్టర్ శ్యామలను విచారణాధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నియమించారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రిమ్స్ జూడాలు ఆందోళన విరమించారు.