తెలంగాణ

telangana

Adi Shankaracharya Statue Omkareshwar

ETV Bharat / videos

Adi Shankaracharya Statue Omkareshwar : 108 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహం.. ఎక్కడో తెలుసా? - ఆదిశంకరాచార్యుల విగ్రహం ఓపెనింగ్

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 2:35 PM IST

Adi Shankaracharya Statue Omkareshwar : 108 అడుగుల ఆదిశంకరాచార్యుల లోహపు విగ్రహాన్ని ఓంకారేశ్వర్​లో గురువారం ఆవిష్కరించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ శింగ్ చౌహాన్. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్​లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్​ను చేపట్టింది. విగ్రహ ఆవిష్కరణకు ముందు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్ ఆదిశంకరాచార్యుల గొప్పతనం గురించి వివరించారు. 'ఇది ఒక చారిత్రక సందర్భం. ఆదిశంకరాచార్యులు కేరళలో జన్మించినప్పటికీ.. ఆయన ఓంకారేశ్వర్​లోని అడవులు, పర్వతాలలో ప్రయాణిస్తున్నప్పుడు జ్ఞానోదయం పొందారు. ఓంకారేశ్వర్​లో ఆదిశంకరాచార్యులు జ్ఞానం సంపాదించిన తర్వాత కాశీకి ప్రయాణించారు.' అని అన్నారు.

ఓంకారేశ్వర్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాత కొండపై లోహంతో ఆదిశంకరాచార్యులు విగ్రహాన్ని నిర్మించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా సాధువులు, పూజారులు ఆదిశంకరాచార్యుల విగ్రహం వద్ద యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ సహా భారీగా భక్తులు పాల్గొన్నారు. కాగా.. ఆదిశంకరాచార్యుల విగ్రహం సెప్టెంబరు 18న ఆవిష్కరించాల్సి ఉండగా.. ఖండ్వాలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 21న ఆవిష్కరించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్ ఓంకారేశ్వర్‌లోని మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని నిర్మించడానికి రూ. 2,141.85 కోట్ల బడ్జెట్​ను కేటాయించింది.

ABOUT THE AUTHOR

...view details