తెలంగాణ

telangana

meenakshi chowdary

ETV Bharat / videos

Meenakshi Chowdary Opened a Jewellery Shop in Hyderabad : హైదరాబాద్‌లో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి - Heroine Meenakshi chowdary latest news

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 10:22 AM IST

Meenakshi Chowdary Opened a Jewellery Shop in Hyderabad : హైదరాబాద్‌లో సినీ నటి, గుంటూరు కారం ఫేం మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) సందడి చేశారు. నగర శివారులోని సుచిత్రలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు డిజైన్లను ఆవిష్కరించారు. స్టోర్​లో కలియ తిరుగుతూ పలు ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

మీనాక్షి చౌదరి రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజీపై నుంచి ఆమె ప్రజలకు అభివాదం చేశారు. మగువలందరూ అభరణాలను ఇష్టపడతారని మీనాక్షి చౌదరి తెలిపారు. నగలు ఆడవారి అందాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. జ్యువెల్లరీ షాప్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ అన్న.. ఇక్కడ బిర్యానీ అన్న ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఓ మంచి చిత్రంతో రానున్నట్లు మీనాక్షి చౌదరి వివరించారు. ఈ స్టోర్​లో మగువలను కట్టిపడేసే అద్భుతమైన బంగారు ఆభరణాల కలెక్షన్లు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details