'రాజన్న' టు 'తికమక తాండ'- చైల్డ్ ఆర్టిస్ట్ యాని సినీ జర్నీ - actress annie etv bharat interview
Published : Dec 15, 2023, 5:04 PM IST
Actress Annie Career Journey : 'రాజన్న' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది నటి యాని. ఆ సినిమాలో మల్లమ్మ పాత్రలో తన నటనకుగాను ఏకంగా 3 నంది అవార్డులు అందుకుందీ నటి. బాల నటిగా టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్ బాబు, జగపతి బాబు, ప్రభాస్ సినిమాల్లో వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది యాని. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'రంగస్థలం'లో హీరోకు చెల్లిగా నటించింది. అయితే అటు పర్సనల్ కెరీర్లో గ్రాడ్యుయేషన్ (బీకామ్) కంప్లీట్ చేసిన ఈ యంగ్ బ్యూటీ, ఇప్పుడు తెరపై హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈమె లీడ్‌లో తెరకెక్కిన 'తికమక తాండ' సినిమా నేడు (డిసెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాల నటిగా కెరీర్ ప్రారంభిన యాని, హీరోయిన్గా కంటే మంచి నటిగా పేరు తెచ్చుకోడానికే కష్టపడతా అని అంటోంది. తన సినీ ప్రయాణం పదిమందికైనా స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఆకాక్షిస్తుంది. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణం గురించి యాని ఈటీవీ భారత్‌కు వివరించింది.