Actor Murali Mohan on Chandrababu Arrest : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరం : మురళీ మోహన్ - చంద్రబాబు నాయుడు అరెస్టు
Published : Oct 8, 2023, 9:15 PM IST
Actor Murali Mohan on Chandrababu Arrest : రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరమని సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ఓ హోటల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై హైదరాబాద్, బెంగుళూరు నగరాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Arrest : సాధారణంగా సూర్యుడు, చంద్రునికి కొద్దిసేపు గ్రహణం పట్టి తేజోవంతం అవుతాయని.. అలాగే చంద్రబాబుకు నేడు గ్రహణం పట్టిందని తెలిపారు. ఈ పరిస్థితి కొద్ది రోజులే ఉంటుందని.. మరల చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో.. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్టు చేయడం ప్రభుత్వం దుశ్చర్యగా దుయ్యబట్టారు. ఈ అరెస్టును అఖండ తెలుగు ప్రజలు ఖండిస్తున్నారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు.