తెలంగాణ

telangana

Kapil Sharma

ETV Bharat / videos

Kapil Sharma Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో కపిల్ శర్మ - Kapil Sharma on Green India Challenge

By

Published : May 11, 2023, 7:08 PM IST

Kapil Sharma participate Green India Challenge : నవ్వులు శాశ్వతంగా ఉండాలంటే మొక్కలు నాటాలని ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌, హాస్య నటుడు కపిల్ శర్మ అన్నారు. మనిషికి సరిపడా ఆక్సిజన్ దొరికినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ముంబయిలో ఉన్న దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్​తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ  కార్యక్రమం ఎంతో ఉన్నత ఆశయంతో కూడుకున్నదని కపిల్ శర్మ పేర్కొన్నారు. మనం మన కోసం కాదని.. ఇతరుల కోసం కూడా అనే భావనను తనలో కలిగించిందని వివరించారు. ఇదొక కార్యక్రమంలా కాకుండా బాధ్యతగా దీనిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొనాలని కోరారు. తన షో వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి.. సంతోష్ కుమార్ పచ్చని ఆశయానికి అండగా నిలవాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న సంతోష్​ కుమార్​కు కపిల్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details