తెలంగాణ

telangana

ETV Bharat / videos

వాయువేగంతో కారు.. బైకర్​ను ఢీకొట్టి.. నేరుగా వెళ్లి కరెంటు స్తంభానికి.. - స్తంబాన్ని ఢీకొట్టిన కారు

By

Published : Oct 6, 2022, 9:44 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. రోడ్డు పక్కనే ఉన్న బైక్​ను ఢీకొట్టాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కరెంట్​ పిల్లర్​ను ఢీకొట్టేసరికి కారు ఆగింది. ఈ ప్రమాదంలో బైకర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు ఘటనాస్థలిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత రాంజీ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details