తెలంగాణ

telangana

Robbery incident at SBI ATM in Moga in broad daylight Thieves did not take cash this time but AC the entire incident was caught on CCTV camera.pb10033

ETV Bharat / videos

ATMలో డబ్బులు వదిలేసి 'AC' చోరీ.. వీరేం దొంగలు బాబోయ్​! - robbery incident at atm

By

Published : Jul 16, 2023, 8:59 AM IST

Updated : Jul 16, 2023, 11:01 AM IST

ఇటీవలే మహారాష్ట్రలో బద్దలు కాలేదని ఏకంగా ఏటీఎం మెషిన్​నే దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన గురించి వినే వింటారు. తాజాగా పంజాబ్​లోని మోగా జిల్లాలో ఏటీఎంలో ఉన్న మెషిన్​, డబ్బు కాకుండా.. ఏసీను దోచుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై బ్యాంకు మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీ ఎలా జరిగిందంటే?
జిల్లాలోని బాఘ్​ పట్టణంలోని ఎస్​బీఐ బ్యాంక్​ ఏటీఎంలో ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం.. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులో ఒకడు.. అక్కడే డస్ట్​ బిన్​ను తిరుగవేసి పైకి ఎక్కాడు. ఇండోర్​ ఏసీ యూనిట్​ వైర్​లను కత్తిరించేశాడు. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఏసీ మెషిన్​ను ఇద్దరు కలిసి దోచుకెళ్లిపోయారు. చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

అయితే చోరీ ఘటనపై బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. గతంలో కూడా బ్యాంకుకు చెందిన మోటారు సైకిల్ కూడా చోరీకి గురైన సమయంలోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

Last Updated : Jul 16, 2023, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details