తెలంగాణ

telangana

ఆలయాల్లో ఏసీ కూలర్లు ఏర్పాటు

ETV Bharat / videos

మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఉక్కపోత!.. ఆలయాల్లో ఏసీ, కూలర్లు ఏర్పాటు - కాశీ విశ్వనాథ దేవాలయం ఉత్తర్​ప్రదేశ్​

By

Published : Jun 17, 2023, 3:58 PM IST

వేసవి కాలం ముగుస్తున్నా.. ఎండల తీవ్రత మాత్రం ఇంకా తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి జిల్లాలో కూడా ఎండల తీవ్రత అధికంగానే ఉంది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దేవుళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని భావించిన భక్తులు.. దేవాలయాల్లోని గర్భగుడిలో ఏసీ, కూలర్లు ఏర్పాటు చేశారు. భగవంతుడికి కూడా ఉక్కపోత పోస్తుందంటూ.. పలు ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. 

దేవుడికి నైవేద్యంగా చల్లని పానీయాలు ఇస్తున్నారు. రోజుకు రెండు సార్లు స్నానం చేయిస్తున్నారు. సౌకర్యంగా ఉండేందుకు భగవంతుడి విగ్రహాలను కాటన్​ దుస్తులతో అలంకరిస్తున్నారు. ప్రసిద్ధ బడా గణేష్ టెంపుల్, దుర్గ్ వినాయక్ గణేశ్​ మందిర్​, త్రిదేవ్ టెంపుల్, బతుక్ భైరవ్ మందిర్​, శ్రీ కాశీ విశ్వనాథ వంటి దేవాలయాల్లో.. ఇలా ఏసీలు, కూలర్లు ఏర్పాట్లు చేశారు నిర్వహకులు. దాతలు, భక్తులు ఇచ్చిన విరాళాలతో వీటిని ఏర్పాట్లు చేసినట్లు వారు చెబుతున్నారు. మనుషులుల్లాగే దేవుళ్లు కూడా ఎండలకు ఇబ్బంది పడతరని.. అందుకే ఈ ఇలా చేస్తున్నామని భక్తులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details