తెలంగాణ

telangana

Hanuman in Theatre

ETV Bharat / videos

Monkey in Theatre: 'ఆదిపురుష్​' థియేటర్​లో అద్భుతం.. సినిమాకు అనుకోని అతిథి.. వీడియో వైరల్​ - జై శ్రీరామ్‌

By

Published : Jun 16, 2023, 6:01 PM IST

Hanuman in Theatre: వాల్మికీ రచించిన రామాయణం ఇతిహాసంగా తెరకెక్కిన ఆదిపురుష్​ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  ‘ఆగమనం.. అధర్మ విధ్వంసం..’ అంటూ రాముడిగా ప్రభాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఆదిపురుష్‌’ విడుదలై సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఓ థియేటర్లో జరిగిన సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శిస్తున్న థియేటర్​లో అనుకోని అతిథి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 

రామాయణం ఎక్కడైతే ప్రదర్శిస్తారో అక్కడికి హనుమంతుడు వస్తాడనేది ఈ సంఘటనతో రుజువు అయ్యింది. అలాగే ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ థియేటర్​లో అనుకోకుండా ఓ వానరం ప్రవేశించి ‘ఆదిపురుష్‌’ సినిమాని వీక్షించింది. దీంతో హాలంతా ఒక్కసారిగా ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసినవారంతా జై శ్రీరామ్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘హనుమంతుడే వచ్చి సినిమా చూశాడు’ అంటూ వీడియోను సోషల్​ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

అయితే ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగిందని ప్రచారం జరుగుతోంది. నగరంలోని వి మెగా టాకీస్ థియేటర్లో తెరపై ఆదిపురుష్ చిత్ర ప్రదర్శన కొనసాగుతుండగా ఓ వానరం థియేటర్లోకి వచ్చి చిత్రాన్ని వీక్షించింది. ఇది చూసిన థియేటర్​లోని ప్రేక్షకులు హనుమంతుడే వచ్చాడని సందడి చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతపురంలో వానరం థియేటర్​కు రావడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. 

ABOUT THE AUTHOR

...view details