చేపలు పట్టేందుకు వెళ్లి.. వాగులో చిక్కుకుని.. - young man stuck in vaagu in mahabubabad district
young man stuck in Paleru vagu: మహబూబాబాద్ జిల్లాలోని పాలేరు వాగులో ఓ యువకుడు చిక్కుకుపోయాడు. దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్ సురేశ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేశ్(18) వాగులో చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. యాకేశ్‌ను రక్షించేందుకు గ్రామస్థుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు తాడు సాయంతో యాకేశ్‌ను బయటకు లాగారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST