తెలంగాణ

telangana

marriage

ETV Bharat / videos

young man from Hyderabad married Mexican girl : హైదరాబాదీ అబ్బాయికి మెక్సికో అమ్మాయితో ప్రేమవివాహం - హైదరాబాద్​లో ఖండాతర వివాహం

By

Published : May 12, 2023, 7:08 PM IST

young man from Hyderabad married a Mexican girl :  ఒకప్పుడు పెళ్లి సంబంధం కోసం తెలిసిన వాళ్లతోనో.. ఊర్లోని పురోహితుడి ద్వారానో వెతికేవారు. ఇప్పుడు ట్రెండ్​ మారింది. మ్యారేజ్​ బ్యూరోలు, సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభమైంది. ప్రేమ వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రేమ.. కుల మతాల గోడలను బద్దలుకొట్టి ఖండాంతరాలు దాటుతోంది. పిల్లల ప్రేమను కాదనలేక పెద్దలు కుడా పచ్చజెండా ఊపుతున్నారు. అలాంటి ఖండాంతర ప్రేమ వివాహమే భాగ్యనగరంలో జరిగింది. 

హైదరాబాద్ అంబర్​పేట్ చెందిన యోల్లంకి సమ్మక్క, మల్లయ్య దంపతుల కుమారుడు సందీప్​కుమార్, మెక్సికోకు చెందిన లొరెనా రోడ్రిగేజ్ మజోకో- హువాన్ అల్బెరోటో అబుదొ మెనా దంపతుల పుత్రిక లొరాన్స్​తో వివాహం ఘనంగా జరిగింది. హిమాయత్​నగర్​లోని ఫంక్షన్​హాల్లో హిందూ సాంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించారు. సందీప్​కుమార్ మెక్సికోలోని అక్కడి విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాల పీజీకోర్సు చదువుకోవడానికి వెళ్లారు. అక్కడ లొరాన్స్​తో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటామని..పెళ్లికుమారుడు సందీప్​కుమార్ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించాడు.  భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఇష్టమని.. ఇరువురి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నామని వధువు తెలిపింది. 

ABOUT THE AUTHOR

...view details