తెలంగాణ

telangana

TSPSC

ETV Bharat / videos

TSPSC జిరాక్స్ సెంటర్.. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభించును - టీఎస్‌పీఎస్సీ ఓ జీరాక్స్ సెంటర్ వాల్‌ పోస్టర్స్‌

By

Published : Mar 22, 2023, 11:03 AM IST

TSPSC Xerox Centre Posters: రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, వివిధ విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీంతో ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ గోడపై వాటిని అంటించారు.

ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభించును అంటూ రాశారు. తప్పు చేసిన కమిషన్ బోర్డును రద్దు చేయాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. ప్రశ్నాపత్రాల లీకేజీలో ఆయన కుటుంబసభ్యుల పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. అలాగే నష్టపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని.. అప్పటి వరకు వారికి నెలకు రూ.10,000 చొప్పున ఇవ్వాలని అందులో కోరారు. 

ABOUT THE AUTHOR

...view details