తెలంగాణ

telangana

Accident in Shankar Palli

ETV Bharat / videos

Auto Accident: స్కూల్ పిల్లల ఆటో బోల్తా.. ఒక్కరు మృతి.. ఇద్దరికి గాయాలు - rangareddy crime news

By

Published : Apr 19, 2023, 5:18 PM IST

Students auto an Accident in Shankar Palli: రంగారెడ్డి శంకర్ పల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి పిల్లలతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శంకర్ పల్లికి చెందిన విద్యార్థులు.. సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బీడీఎల్ భానూరు డీఏవీ పాఠశాలలో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవటంతో తల్లిదండ్రులు ఓ ఆటోను ఏర్పాటు చేశారు. శంకర్ పల్లి నుంచి పిల్లలను పాఠశాలకు పంపుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం విద్యార్థులను తీసుకువెళ్లిన ఆటో.. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా అదుపు తప్పింది. శంకర్ పల్లి సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లి, బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సంతోష్- బీనా దంపతుల కుమారుడు ఐదో తరగతి చదివే సీనా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 20మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించినందునే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై శంకర్ పల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details