Yadadri Temple: హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా యాదాద్రిలో శిలాఫలకం - తెలంగాణ న్యూస్
A stone slab of Hindava culture at Yadadri Temple: సంపూర్ణంగా కృష్ణ శిలతో నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఆ గుడిలో హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. పంచనారసింహుల దివ్యాలయం పడమటి దిశలోని పంచతల రాజగోపురం ఎదుట దశావతారాలతో తయారు చేసిన శిలా ఫలకాన్ని ఏర్పరిచారు. ఈ ఫలక కృష్టశిల రంగుతో పోలి ఉండడం దీని విశేషం. హైందవ సంస్కృతికి సంబంధించిన శంఖు, చక్ర, తిరునామాలను ఈ శిలా ఫలకంలో పొందుపరిచారు. దిగువ భాగాన నరసింహ శ్లోకం చెక్కారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంత రించుకునేలా ఆలయాధికారులు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. స్వామిని దర్శించుకొని బయటకు వచ్చే క్రమంలో పడమటి రాజ గోపురం వైపు వచ్చే భక్తులను ఆకర్షించేలా భారీ ఫైబర్ సెట్టింగ్ పెట్టారు. ఈ సెట్టింగ్ పై భాగంలో శంకు, చక్ర, తిరునామాలు మధ్యలో దశవతారాలు పెట్టారు. భక్తులు చదువుకొనేందుకు వీలుగా ఉండేలా వీటిని ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు.