తెలంగాణ

telangana

15 kg silver brick gift to pm modi with image of Sri Rama

ETV Bharat / videos

15 కిలోల వెండితో ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక.. అయోధ్య గుడి, శ్రీరామ ప్రతిమలతో.. - నరేంద్ర మోదీ లేటెస్ట్ న్యూస్

By

Published : Mar 25, 2023, 3:29 PM IST

విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ కోసం కర్ణాటకలోని దావణగెరెకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి.. బీజేపీ నేతలు ప్రత్యేక కానుకను అందించనున్నారు. 15 కిలోల వెండితో తయారు చేసిన ఇటుకను ఇవ్వనున్నారు. రూ. 11 లక్షలతో పుణెలో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి. ఈ ఇటుకపై నాలుగు దిక్కులు.. నాలుగు ఆకృతులను చెక్కారు. ఓ వైపు శ్రీరాముని ప్రతిమ.. మరో వైపు అయోధ్య రామ మందిరం. మిగతా రెండు వైపుల్లో.. జై శ్రీరామ నామం, కమలం గుర్తు ఉంది. వీటితో పాటు 1990లో జరిగిన రామజ్యోతి యాత్ర సమయంలో చనిపోయిన 8 మంది పేర్లు దీనిపై చెక్కారు. ఇంతకుముందు కూడా ఇలాంటి కానుకను బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం 13 డిసెంబర్​ 2022న రామ్​నగర్​ బీజేపీ శ్రేణులు వెండి ఇటుకను కానుకగా ఇచ్చాయి. కాగా, విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ కోసం దావణగెరె నగరం ముస్తాబయ్యింది. నగరంలోని ప్రధాన వీధులన్నీ కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details