ముసలోడే కానీ మహానుభావుడు.. నవ్వులు పూయిస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్ డైరక్షన్ - A sailor directed pre wedding shoot in Andhra
ఉత్తరాంధ్రాకు చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ను డిఫరెంట్‌గా చేసుకోవాలనుకునే ఉద్దేశంతో.. చిన్నపాటి నదిని లొకేషన్‌గా ఎంచుకుంది. అక్కడ వారికి ఒక వింత అనుభవం ఎదురైంది. అదేంటో మరి ఓసారి మీరూ చూసేయండి. హ్యాపీగా నవ్వుకోండి. వీలైతే మీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కు మీరు కూడా అక్కడికే వెళ్లండి. అసలు సంగతేంటంటే..?
సాధారణంగా ఫొటో షూట్ అంటే కెమేరామెన్ పోజులు చెబుతుంటే వధూవరులు ఇద్దరూ స్టిల్స్ ఇస్తుంటారు.. కానీ ఇక్కడికి వచ్చిన జంటకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఫొటోలైతే తీసుకున్నారు కానీ ఎవరి దర్శకత్వంలో తీసుకున్నారో తెలుసా. నాటు పడవ నడిపే నావికుడి దర్శక సూచనలు పాటిస్తూ. ఐదు పదుల వయసులోనూ ఆ వ్యక్తి ఈ జనరేషన్ జోడీకి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోజులు చెప్పడం చూసి ఆ జంట ఆశ్చర్యపోయింది. అతను చెప్పిన స్టిల్స్ నచ్చి వెంటనే అతడు చెప్పినట్టు పోజులిచ్చారు. మరోవైపు కెమెరామెన్ ఇదంతా చూసి.. ముసలోడే కానీ మహానుభావుడు అనుకుని చిరునవ్వు చిందించాడు. వెంటనే అదంతా తన కెమెరాలో బంధించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు " ఏంట్రా నువ్వు ఇంత టాలెంటేడ్లా ఉన్నావు" అని " ముసలోడే కాని మహాను భావుడు" అని "తాత ఇలాంటివి ఎన్ని చుసుంటాడో" అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతలా నవ్వలు పూయించిన ఈ వీడియోలో జంటకు ఫొటో పోజులు వర్ణించిన తీరు.. ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కేయండి..
ఇవీ చదవండి: