సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు.. - సిటీ బస్సులో మంటలు
ప్రయాణంలో ఉన్న బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్‌కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు అంటుకున్నాయి. ఘటన సమయంలో బస్సులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. బస్సులో ఎలా మంటలు వ్యాపించాయనే విషయం ఇంకా తెలియలేదు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST