నగరవాసులను ఆకట్టుకుంటున్న గండిపేట ల్యాండ్ స్కేప్ పార్కు - హైదరాబాద్లో కొత్త పార్కులు
landscape park in Gandipet: హైదరాబాద్ గండిపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేప్ పార్క్.. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పార్కు విహంగ దృశ్యాలు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. చిన్న పిల్లల కోసం ఆటస్థలం, కుటుంబం అంతా కలిసి సరదాగా గడిపేందుకు పిక్నిక్ స్పార్ట్స్, ఒపెన్ ఎయిర్ థియేటర్, ఫుట్ కోర్ట్.. అందమైన ల్యాండ్ స్కేప్‌లు, ఆకట్టుకునే పూలతో తీర్చిదిద్దిన ఈ పార్కు.. హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా రూ.35 కోట్లతో.. 5.5 ఎకరాల్లో హెచ్ఎండీఏ వారు అభివృద్ధి చేశారు. మంత్రి కేటీఆర్ మంగళవారం ఈ ఉద్యానవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST