Onions for Rs.1 in Karimanagr : 'రండి బాబు.. రండి.. కిలో ఉల్లిగడ్డ రూపాయికే' - telangana latest news
Onions for Rs.1 in Karimanagr : ఏదైనా ఉచితంగా దొరికిందంటే ఎవరైనా సరే ఎగబడుతుంటారు. ఇంట్లో ఎంత ఉన్నా సరే ఇంకొంచెం కావాలనే ఆశ పడుతుంటారు. ఎగబడి ఎత్తుకుపోతుంటారు. అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఉల్లిగడ్డల లోడ్‌తో వచ్చిన వారు.. రూపాయికి కిలో చొప్పున విక్రయిస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉల్లిగడ్డల వ్యాన్ దగ్గరకి బారులు తీశారు. ఊహించని రీతిలో తక్కువ ధరకు ఉల్లిగడ్డలు విక్రయించడంతో ప్రజలు వాహనాలు తెచ్చుకుని భారీ మొత్తంలో ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఉల్లిగడ్డ వస్తుండటంతో గ్రామీణులు కొనడానికి ఎగబడ్డారు.
అసలేం జరిగిందంటే..నాగ్‌పుర్‌కు చెందిన వ్యక్తి వరంగల్ మార్కెట్లో ఉల్లిని విక్రయిచండానికి తీసుకెళ్లాడు. మార్కెట్లో ఉల్లికి కనీస ధర లేకపోవడంతో ఆ వ్యక్తి వ్యాన్‌లో తిరుగు ప్రయాణమయ్యాడు. కొత్తగట్టు వద్ద వ్యాన్‌ను నిలిపి కిలోకి రూపాయి చొప్పున 50కిలోల ఉల్లి బస్తాను రూ.50కు విక్రయించాడు. దీంతో తక్కువ ధర పలుకుతుండటంతో ప్రజలు పెద్దఎత్తున కొనుగోలు చేశారు.