Live Video నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య - మెట్రో రైలుకి ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య
భాగ్యనగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.30గంటల సమయంలో మెట్రో రైలు స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టికెట్ తీసుకోకుండా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ట్రాక్‌పైకి చేరుకుని రైలు రాగానే దూకాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST