తెలంగాణ

telangana

A Man Climbs Electricity Pole in Maharashtra

ETV Bharat / videos

కరెంట్​ స్తంభం​ ఎక్కి వ్యక్తి హల్​చల్- రెండు గంటలు నిలిచిపోయిన రైళ్లు - రైల్వేస్టేషన్​లో కరెంట్​ పోల్​ ఎక్కిన వ్యక్తి

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 5:41 PM IST

A Man Climbs Electricity Pole in Maharashtra : మహారాష్ట్రలోని నందూర్​బార్ రైల్వే స్టేషన్​లో మతిస్తిమితం సరిగా లేని ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి హల్​చల్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే విద్యుత్​ సరఫరాను నిలిపివేశాడు. దీంతో రెండు గంటలు పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  

రైల్వే పట్టాలపై ఉండే హైటెన్షన్​ పోల్​ పైకి మతిస్తిమితం సరిగా లేని వ్యక్తి ఎక్కి అటు ఇటూ తిరుగుతూ బీభత్సం సృష్టించాడు. అధికారులు ఎంత ప్రయత్నించినా గంటపాటు కిందకు దిగలేదు. తర్వాత సిబ్బంది ఎలాగోలా నచ్చచెప్పి నిచ్చెన సాయంతో అతడిని కిందకు తీసుకొచ్చారు. తర్వాత ఆసుప్రతికి తరలించారు. 

ఆ వ్యక్తి చేసిన హంగామా​ కారణంగా రైల్వే స్టేషన్​లో గంటపాటు విద్యుత్​ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. దీంతో భుసావల్ - సూరత్​ మధ్య పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details