Medak Fire Accident : మరో అగ్నిప్రమాదం.. మెదక్ జిల్లాలో స్క్రాప్ దుకాణంలో మంటలు - Fire Accident at toopran
Medak Fire Accident Today: మెదక్ జిల్లా తూప్రాన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూప్రాన్‌లోని పాత ఎస్‌బీహెచ్ బ్యాంకు వెనుక పోతారం ఆంజనేయులుకి చెందిన స్క్రాప్ దుకాణం(పాత ఇనుప సామగ్రి దుకాణం)లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలోని సీసాలు, వైర్లు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి.
ఇళ్ల మధ్యలో షాప్ ఇళ్ల ఉండటంతో భయంతో ప్రజలు బయటకు పరుగు తీశారు. స్థానికంగా ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. చాలా సేపటి తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో అప్పటికే ఆ ప్రాంతమంతా దట్టని పొగలతో నిండిపోయింది. స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.
ఇటీవల రాష్ట్రంలో తరచూ అగ్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తోంది. నిన్న టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చుట్టు పక్కల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అప్రమత్తత అవసరమని పోలీసులు చెబుతున్నారు. వెంటనే అగ్ని మాపక దళాలకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.