Fire accident: మల్యాల మండల కేంద్రంలోని వస్త్రదుకాణంలో అగ్ని ప్రమాదం - Jagtial District News
Fire accident in garment shop at Malyala: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దుకాణం నుంచి పొగలు బయటకు రావడంతో దుకాణ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు భారీగా ఎగిసి పడ్డాయి, పొగలు వ్యాపించడంతో పక్క దుకాణదారులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే దుకాణంలో ఉన్న వస్త్రాలు, సామాగ్రి పూర్తిగా కాలి పోయింది. సుమారు 20 లక్షల రూపాయాల మేర నష్టం వాటిలినట్లు దుకాణం యజమాని తాటిపాముల మోహన్ తెలిపారు. కింద వస్త్ర దుకాణం ఉండగా.. పై అంతస్తులో మోహన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. దుకాణం నుంచి పొగ వాసన రావడంతో అందరూ బయటకు వచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన చోట జనాలు పెద్దఎత్తున గుమ్మిగూడారు.